భారతదేశం, సెప్టెంబర్ 21 -- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని పోలీస్ వాహనాలపై స్టిక్కర్లను మార్చాలని ఆదేశించారు. సెప్టెంబర్ 21, ఆదివారం నాడు 134 పోలీసు వాహనాల్లో తెలంగాణ రాష్ట్ర టీఎస్.. స్థానంలో టీజీతో భర్తీ చేశారు. దీని అంచనా వ్యయం రూ. 1.6 కోట్లతో జరిగింది.

వాహనాలపై కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం తాజాగా సీవీ ఆనంద్ ఉత్తర్వులు ఇచ్చారు. 'హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వాహనాలపై ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్ స్టిక్కర్లను తొలగించి, వాటి స్థానంలో టీజీ గుర్తింపు కలిగిన కొత్త తెలంగాణ పోలీస్ స్టిక్కర్లను వేయాలి. అన్ని పెట్రోల్ వాహనాలు, పోలీస్ స్టేషన్ వాహనాలను కొత్త స్టిక్కర్లతో పునరుద్ధరించాలి.' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

వాహనాలకు మెష...