భారతదేశం, జనవరి 4 -- సంక్రాంతి పండుగ సమీపిస్తున్న కొద్దీ, హైదరాబాద్ నుండి చాలా కుటుంబాలు తమ స్వస్థలాలకు ప్రయాణిస్తాయి. చాలా రోజులు తమ ఇళ్లను తాళం వేసి ఉంచుతాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు సూచలను జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఊర్లకు వెళ్ళే ముందు, మీ సమీప పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్‌కు తెలియజేయమని పౌరులను కోరుతున్నట్టుగా హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. తద్వారా పోలీస్ సిబ్బంది సాధారణ గస్తీలో భాగంగా అలాంటి ఇళ్లను నిఘా ఉంచగలుగుతారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

అదే సమయంలో ప్రయాణించేటప్పుడు నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని సీపీ సజ్జనార్ సలహా ఇచ్చారు. దయచేసి వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ఏర్పాట్లలో భద్రపరచుకోవాలని సూచించారు. దొంగతనాలను నివారించడంలో, పండుగను మనశ్శాంతితో జరుపుకొనేందుకు ఈ సా...