భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఊటీ.. ఈ పేరు ఎప్పుడూ వింటూనే ఉంటాం. చాలా మందికి ఇక్కడకు వెళ్లాలని కల. ఇక్కడి ప్రకృతితో ఇట్టే ప్రేమలో పడిపోతారు, అందమైన సరస్సులు, ఎత్తైన కొండలు కట్టిపడేస్తాయి. మీరు కూడా బడ్జెట్ ధరలో ఊటీ వెళ్లాలని అనుకుంటే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..

ఐఆర్‌సీటీసీ టూరిజం అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరుతో టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంటి రైలు ద్వారా ఈ ప్రయాణం చేయవచ్చు. అయితే ఇతర స్టేషన్ల నుంచి కూడా మీరు రైలు ఎక్కొచ్చు. గుంటూరు జంక్షన్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ నుంచి కూడా ఈ టూర్ ప్యాకేజీ ఉంది. టూర్ ముగిశాక మీరు ఆయా స్టేషన్లలో దిగుతారు.

ఈ టూర్ ప్యాకేజీ మెుత్తం 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ఊటీ, కూనూరు చూపిస్తారు. సెప్టెంబర్...