భారతదేశం, ఏప్రిల్ 5 -- కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల ప్రకృతి అందాలను ఆకాశమార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు చేరువవనుంది. ఆ దిశగా తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా.. సోమశిల - శ్రీశైలం క్షేత్రాల మధ్య 'హేలీ టూరిజం' సేవలను ఈ నెల 9వ తేదీన ప్రారంభించనుంది.

హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ యాత్ర సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుంది. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు.

ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువవస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధ...