భారతదేశం, జూన్ 6 -- దైవదర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు IRCTC టూరిజం సరికొత్త ఆధ్యాత్మిక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది "అరుణాచల మోక్ష యాత్ర" (Arunachala Moksha Yatra) పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ ప్యాకేజీ ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరుణాచలం (తిరువణ్ణామలై), కాంచీపురంలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శుక్రవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం జూన్ 12వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ఈ టూర్‌లో ప్రయాణించే వారి సంఖ్యను బట్టి ధరలను నిర్ణయించారు. వాహనాలు, గదులను షేరింగ్ బేసిస్‌పై కేటాయిస్తారు. స్టాండర్డ్ క్లాస్ (స్లీపర్)లో ట్విన్ షేరింగ్ (ఇద్దరు పంచుకుంటే) రూ.14,820, ట్రిపుల్ షేరింగ్ (ముగ్గురు పంచుకుంటే) రూ.11,125గా ఉంటుంది. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో క...