Telangana,hyderabad, ఆగస్టు 13 -- సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణం కేసులో తవ్వే కొద్దే వాస్తవాలు బయటికొస్తున్నాయి. ఈ కేసును లోతుగా పరిశీలిస్తున్న పోలీసులు. కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. అక్రమ సరోగసీ, పిల్లల అక్రమ రవాణతో పాటు ఫేక్ డీఎన్ఏ రిపోర్టులకు సంబంధించి ఆధారాలను సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నార్త్‌ జోన్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌ మంగళవారం వెల్లడించారు.

యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన అక్రమ సరోగసీ కేసును త్వరలోనే ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేయనున్నట్లు డీసీపీ రష్మీ పెరుమాళ్‌ ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటివరకు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏజెంట్లతో సహా 25 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు.

ఈ కేసులో గోపాలపురం పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని. వీటిలో ప్రాథమిక ఎఫ్ఐఆర్ల...