Telangana,hyderabad, ఆగస్టు 23 -- కూకట్ పల్లిలోసంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడింది ఓ బాలుడని తేల్చారు. సదరు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా. హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి మీడియాకు వెల్లడించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సహస్రను హత్య చేసిన బాలుడు సైకో అవతారం ఎత్తాడు. యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్ చూసి బాలిక హత్యకు ప్లాన్ చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను చంపాడు. హత్య చేసిన తర్వాత ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న బాలుడు.. పోలీసుల విచారణలోనూ క్రిమినల్ ఇంటెలిజెన్స్ గా వ్యవహరించినట్లు గుర్తించారు.

ఆగస్ట్ 18వ తేదీన బాలిక సహస్ర హత్య జరిగింది. 3 రోజుల పాటు సరైన క్లూ కూడా దొరకలేదు. ఓ సాఫ్ట...