భారతదేశం, అక్టోబర్ 25 -- నీటి కొరత హెచ్చరికల నేపథ్యంలో.. మహానగరంలో ప్రతి నీటి బొట్టును సంరక్షించేందుకు హైదరాబాద్ జలమండలి తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా సమయంలో విపరీతంగా జరుగుతున్న వృథాకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది.

సామర్థ్యానికి మించి నింపడం, సరిగ్గా మూతలు లేకపోవడం వల్ల లీకేజీలు ఏర్పడి రహదారులపై నీరు విపరీతంగా వృథా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల విలువైన తాగునీరు వృథా కావడమే కాకుండా, రహదారులు దెబ్బతిని వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన జలమండలి యాజమాన్యం... అన్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల జనరల్ మేనేజర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపింది.

2026 నవంబర్ 1వ తేదీ...