భారతదేశం, మార్చి 11 -- హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌కు వెళ్లే పర్యాటకులకు బుధవారం నాడు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్‌ 737-మాక్స్‌ 8 విమానం ఫుకెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం రన్‌వేపై దిగుతుండగా 'నోస్‌ వీల్‌' (ముందు చక్రం) విడిపోవడంతో విమానం అక్కడే నిలిచిపోయింది. దీంతో విమానాశ్రయ అధికారులు వెంటనే స్పందించి రన్‌వేను మూసివేశారు.

హైదరాబాద్‌ నుంచి బుధవారం ఉదయం 6:42 గంటలకు (షెడ్యూల్‌ సమయం 6:20 గంటల కంటే ఆలస్యంగా) బయలుదేరిన 'IX 938' విమానం, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:40 గంటలకు ఫుకెట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. అయితే, విమానం రన్‌వే 9పై ల్యాండ్‌ అయ్యే సమయంలో ఒక్కసారిగా కుదుపులకు లోనై (Hard Landing), ముందు ఉన్న రెండు చక్రాలు విడిపోయాయని డీజ...