Telangana,hyderabad, అక్టోబర్ 5 -- హైదరాబాద్ లో మళ్లీ వర్షాలు షురూ అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, ఫిల్మ్‌ నగర్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట,లక్డీకపూల్‌, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్‌ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, కుత్బుల్లాపూర్‌ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. కొన్నిచోట్ల భారీ వర్షం పడుతుండటంతో. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

వచ్చే 2 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. హైదరాబ...