భారతదేశం, సెప్టెంబర్ 1 -- హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం నేషనల్ హైవే (NH-65) విస్తరణకు కీలక ముందడుగు పడింది. ఈ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC) పచ్చజెండా ఊపింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అందించిన సమగ్ర వివరాలతో సంతృప్తి చెందిన కమిటీ, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు తుది ఆమోదం కోసం కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ వద్దకు పంపగా, సెప్టెంబరులో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందని NHAI అధికారులు భావిస్తున్నారు.

మొత్తం 284 కిలోమీటర్లు ఉన్న ఈ జాతీయ రహదారి అభివృద్ధిని ప్రధానంగా మూడు ప్యాకేజీలుగా వర్గీకరించారు. హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ నుండి విజయవాడ గొల్లపూడి బైపాస్ వరకు ఉన్న 226 కి.మీల 4-లైన్ల రహదారిన...