Telangana,hyderabad, ఆగస్టు 7 -- హైదరాబాద్‌ సిటీలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియాపూర్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకపూల్‌, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

అంతేకాకుండా ఖైరతాబాద్‌, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తో పాటు శివార ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది.

ఇక పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌, మాదపూర్‌, కొండాపూర్‌, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్‌, ఏఎంబీ, ఇనార్బిల్‌ మాల్, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. భారీగా వరద నీరు ఉండటంతో నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. భారీ వర్షం దాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైద‌...