భారతదేశం, జూలై 29 -- Trainee IPS Uday Krishna Reddy Case : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించి, ప్రాణాపాయ బెదిరింపులకు గురిచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తీర్పు మేరకు పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా అసభ్యకరమైన, వేధింపులతో కూడిన సందేశాలు పంపుతూ ఉదయ్‌కృష్ణారెడ్డి తీవ్రంగా వేధించాడని బాధితురాలు తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. అకాడమీలో తోటి స్నేహితుల ముందే తన ప్రతిష...