భారతదేశం, ఆగస్టు 22 -- హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ హబ్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల విస్తీర్ణంలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్న ఓ ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ప్రమాద తీవ్రతకు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకుని, త్వరలోనే అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం అకస్మాత్తుగా పక్కకు వాలిపోతూ కూలిపోయింది. ఈ క్రమంలో శిథిలాలు పక్కనే ఉన్న ఆపార్ట్‌మెంట్‌పై పడటంతో దాని గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

భవనం కూలిన శబ్దానికి పక్కనే ఉన్న హాస్టల్‌లోని విద్యార్థులు, స్థానికులు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికా...