భారతదేశం, ఫిబ్రవరి 19 -- హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు గంజాయి తాగించి అత్యాచారం చేశారు రౌడీషీటర్లు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురు రౌడీషీటర్లు పరారీలో ఉన్నారు. వారికోసం కోసం పోలీసుల గాలింపు చేస్తున్నారు.

బాలిక పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత ఈ దారుణం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే బాలిక చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి వెళ్లినట్టుగా పోలీసులు అంటున్నారు. బాలిక నార్సింగిలో నానమ్మతో నివసిస్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్‌ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. బాధితురాలు నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీకి చెంద...