Hyderabad,telangana, ఆగస్టు 13 -- గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగమంతా కూడా ముందస్తు జాగ్రత్తలను చేపట్టింది.

ఇక ఇవాళ ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపుర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసఫ్ గూడా, దుండిగల్, సికింద్రాబాద్, బాలానగర్, బొల్లారం, ప్యాట్నీ, పారడైజ్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్,మెహదీపట్నం, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తారు వర్షం పడుతోంది. ఉదయం నుంచి వాన పడుతుండటంతో. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఐఎండీ భారీ వర్ష...