Telangana,hyderabad, సెప్టెంబర్ 18 -- హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొడుతోంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత. కుండపోత వర్షం మొదలైంది. చాలా ప్రాంతాల్లో ఆగకుండా దంచికొడుతోంది. గంటల వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.

ఒక గంట వ్యవధిలోనే బహదూర్‌పురాలో 7.6 సెం.మీ, జూపార్క్ దగ్గర 6.9, రూప్‌లాల్‌ బజార్‌లో 6.9, నాంపల్లిలో 6.1, బండ్లగూడలో 5.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, కుషాయిగూడ, సైనిక్‌పురి, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బండ్లగూడ, ఎస్‌ఆర్‌ నగర్‌, బల్కంపేట, మెహదీపట్నం టోలీచౌకి, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఎల్బీ నగర్, హయత్ నగర్ తో పాటు పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

భారీ వర్షం దాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ...