Telangana,hyderabad, ఆగస్టు 19 -- హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. జల్ పల్లి నుంచి పురాణపూల్ కు గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బండ్లగూడ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

విద్యుదాఘాతమే మరణాలకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇవాళ ఉదయం గణేష్ ఉత్సవ నిర్వాహకులు 22 అడుగుల గణేష్ విగ్రహాన్ని జల్ పల్లి సమీపంలోని లక్ష్మీగూడ నుంచి పురానాపూల్ కు తరలిస్తున్నారు. టోలీ, వికాస్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా. మరో వ్యక్తికి గాయాలయ్యాయని ఓ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే విద్యుదాఘాతానికి గురై మృతి చె...