భారతదేశం, ఫిబ్రవరి 10 -- మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలో భూప్రకంపనలు సంభవించాయని స్థానికులు పేర్కొన్నారు. మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పలు ప్రాంతాల్లో ఉదయం స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇది భూకంపమేనా? లేదంటే ఇతర పేలుళ్ల కారణంగా భూ ప్రకంపనలు సంభవించాయా? తెలియాల్సి ఉంది.
గాజులరామారంలోని మెట్ కాన్ గూడ నివాసితులు మంగళవారం కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలను అనుభవించారు. ఇది పరిసర ప్రాంతాలలో భయాందోళనలను రేకెత్తించింది. ఆకస్మికంగా భూమి కంపించినట్టుగా అనిపించడంతో భయపడ్డ చాలా మంది జనాలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. పొరుగువారిని ఏం జరిగిందని అడగుతూ భయపడ్డారు. భూ ప్రకంపనల ప్రభావం అనేక శివారు ప్రాంతాలలో ఉందని, భూమి కొద్దిసేపు కంపించిదని మరికొందరు చెబుతున్నారు. దీనిపై స్ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.