భారతదేశం, ఆగస్టు 4 -- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహించిన భారీ తనిఖీల్లో ఏకంగా 25,300 కిలోలకు పైగా కల్తీ మసాలా దినుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మసాలా దినుసులు ఆకర్షణీయంగా కనిపించేందుకు, వాటి బరువును కృత్రిమంగా పెంచేందుకు వ్యాపారులు అత్యంత ప్రమాదకరమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుస్తులకు వేసే కలర్లు, ఇండస్ట్రియల్ రంగులు, పౌడర్, సింథటిక్ రంగులను విస్తృతంగా వాడారు. నాణ్యత లేని దినుసుల రూపురేఖలను మార్చి ప్ర...