భారతదేశం, సెప్టెంబర్ 22 -- చిత్తూ చిత్తూల బొమ్మ..శివుడీ ముద్దుల గుమ్మా అంటూ ఎంగిలి పూల బతుకమ్మ రోజు మహిళలు ఆడి పాడారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా మెుదలు అయ్యాయి. హైదరాబాద్‌లోనూ ఏర్పాట్లు భారీగా చేశారు. బతుకమ్మ తెలంగాణ గుర్తింపు, సాంస్కృతిక గర్వం అని, ఇబ్బందులు లేకుండా వేడుకలను నిర్వహించడానికి జీహెచ్‌ఎంసీ కట్టుబడి ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు.

బతుకమ్మ ఉత్సవాలను సజావుగా నిర్వహించడానికి, నగరంలోని వివిధ ప్రాంతాలలో 450 చోట్ల ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఇతర ఏర్పాట్లలో 384 మంది పారిశుధ్య కార్మికులను నియమించడం, 1,450 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించడం, 82 తాత్కాలిక విద్యుత్ లైటింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది ప్రధాన వేదికలు పీపుల్స్‌ ప్లాజా, ఎల్‌బీ స్టేడియం, జలవిహార్‌, కాప్రా సరస్సు, ఉప్పల్‌ నల...