భారతదేశం, మే 23 -- Hyderabad Advocate Khaja Moizuddin Murder Case : హైదరాబాద్ పరిధిలోని మాసాబ్ ట్యాంక్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన ఇంటి ముందు ఉన్న కారులో ఎక్కే క్రమంలో సీనియర్ న్యాయవాది ప్రమాదానికి గురయ్యాడు. ఆపై ఆస్పత్రికి తరలించినప్పటికీ గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారమే. న్యాయవాదిని కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. సీనియర్ అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్(63) మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం వెలుపల పార్క్ చేసి ఉన్న తన టొయోటా ఇన్నోవా (Toyota Innova) కారులో బ్యాగును లోపల పెడుతున్నారు. ఆయన డ్రైవింగ్ సీట్ ఎక్కేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. రోడ్డుపై వస్తున్న ఒక గ్రీన్ కలర్ 'మహీంద్రా స్కార్పియో' కారు(నెంబర్ ప్లే...