భారతదేశం, సెప్టెంబర్ 21 -- తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులో కూడిన వర్షం పడింది. ఇక హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసింది. మల్కాజ్‌గిరి, నారపల్లి, జోడిమెట్ల, ఉప్పల్, మల్కాజ్ గిరి తార్నాక, ఎల్బీనగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్‌తోపాటుగా మరికొన్ని ఏరియాల్లో జోరుగా వాన పడింది. తెలంగాణలో ఓవైపు బతుకమ్మ పండుగ మెుదలైంది. ఆడపడుచులు బతుకమ్మ ఆడుతుండగా వర్షం పడింది. ఇక భాగ్యనగరంలో వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది అయింది.

హైదరాబాద్‌లో కొన్ని రోజుల కిందట వరద నీటిలో కొట్టుకుపోయి పలువురు మరణించారు. కిందటి బుధవారం రాత్రి పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా వరద నీటిలో 27 ఏళ్ల వ్యక్తి కొట్టుకుపోయాడు. న్యూ బల్కంపేట్ వంతెన సమీపంలో ఈ విషాద సంఘటన జరిగిం...