భారతదేశం, సెప్టెంబర్ 22 -- తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరికొన్ని గంటలు వర్షాలు భారీగా కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సెప్టెంబర్ 25 నుంచి 27 మధ్య తెలంగాణలో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26-27 తేదీలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం నగరాన్ని చుట్టుముట్టింది. సెర్లింగంపల్లి, కూకట్‌పల్లి, షేక్‌పేట్, ఖైరతాబాద్, టోలీచౌకీ, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్...