భారతదేశం, జనవరి 27 -- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్(MANAGE)లో పలు ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

3 అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి, అభ్యర్థులు సంబంధిత రంగంలో తగిన పని అనుభవంతో పాటు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ (వ్యవసాయ విస్తరణ / వ్యవసాయ ఆర్థిక శాస్త్రం / వ్యవసాయ వ్యాపార నిర్వహణ / మానవ వనరుల నిర్వహణ) లేదా పీహెచ్‌డీ కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణత కావాలి. గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది.

జీతం నెలకు రూ.57,...