భారతదేశం, మార్చి 16 -- 'షబ్-ఎ-ఖదర్' (జాగ్నే కీ రాత్) సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ఆంక్షలు విధిచారు. మార్చి 16, 17 తేదీలలో రాత్రి 10:00 గంటల తర్వాత హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లైఓవర్లపై ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఏ ఫ్లైవర్లపై ఆంక్షలు ఉన్నాయో చూడండి.

రాత్రి వేళల్లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున, రహదారి భద్రతను కోసం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేదా ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏవైనా అసౌకర్యాలు కలిగితే, వాహనదారులు 9010203626 నంబర్ ద్వారా ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. మార్చి 16, 17వ తేదీల్లో రాత్రి 10 గంటల తర్వాత కొన్ని ఫ్లైఓవర్లపై బైక్‌లను అనుమతించమని.. హైదరాబా...