భారతదేశం, అక్టోబర్ 6 -- హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ఈ మేరకు ఇటీవల నిర్ణయం తీసుకోగా.. ఇది ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జంట నగరాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ ప్రయాణం భారం కానుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్-ఎక్స్‌ప్రెస్ బస్సుల అన్నింటిలోనూ కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.

మెుత్తానికి ఛార్జీలు రూ.5 నుంచి రూ.10 వరకు పెరగనున్నాయి. మెుదటి మూడు స్టేజీలకు రూ.5 రూపాయలు, 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మెుదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు అవుతుంది. సోమవారం అంటే నేటి నుంచే ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయి.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జీగా పిలిచే ఈ ఆదాయాన్న...