భారతదేశం, జూలై 13 -- వియత్నాంలోని ఫు క్వోక్ దీవి సమీపంలో శనివారం జరిగిన ఘోర పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బాధితులు, అక్కడ తమ కోసం ఆందోళనగా వేచి చూస్తున్న కుటుంబ సభ్యులను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

విజయవాడకు చెందిన మహిపాల్ సంఘ్వి జూలై 8న దాదాపు 80 మంది పర్యాటకుల బృందంతో కలిసి వియత్నాం వెళ్లారు. ఆయన తన చేదు అనుభవాన్ని పంచుకుంటూ.. 'మేం జులై 11న ఫు క్వోక్ దీవికి చేరుకున్నాం. మా బృందంలోని కొందరు వాటర్ స్పోర్ట్స్ కోసం వెళ్లగా, నేను ఒడ్డునే ఉండిపోయాను. కొంత సమయం తర్వాత ఒక బోటు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. సహాయక సిబ్బంది నీటిలో పడిపోయిన వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు. మేం వారికి వెంటనే సి.పి.ఆర...