భారతదేశం, సెప్టెంబర్ 1 -- హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, మరొక అధికారిని నియమించాలని సీఎస్‌కు స్పష్టం చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

గత జులై 27న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండలతో కూడిన డివిజన్ బెంచ్, ఇరువైపులా సుదీర్ఘ వాదనలను విన్నది. అనంతరం సింగిల్ జడ్జి జారీ చేసిన ఆదేశాలను నవంబర్ 3వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది.

ఓ రియ...