Telangana,hyderabad, అక్టోబర్ 10 -- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా తదుపరి విచారణను కూడా వాయిదా వేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయింది. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నోటిఫికేషన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ను కూడా ఎత్తివేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు జీవో 9పై కూడా హైకోర్టు స్టే ఇవ్వటంతో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను వెకేట్ చేయించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇలా కాకుండా హైకోర్టులో కేసులో తేలే వరకు ఎన్నికలను వాయిదా వేసే ఆలోచన కూడా చేయవచ్చు.

ఇలా కాకుండా. పాత రిజర్వేషన్లతోనే మరో నోటిఫిక...