భారతదేశం, జూలై 21 -- కొన్ని రోజులుగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం(జులై 22) హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణ రెడ్డి అనే ఐపీఎస్ ట్రైనీపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కొన్ని వారాలుగా నిందితుడు తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నట్లు సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. జూన్ 23వ తేదీ నుండి ఈ వేధింపుల పర్వం మొదలైందని, రోజురోజుకూ నిందితుడి ప్రవర్తన మితిమీరిపోయిందని ఆమె ఆవే...