భారతదేశం, అక్టోబర్ 2 -- వాషింగ్టన్: అమెరికాలోని హెచ్-1బీ వీసా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, దానిని రద్దు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ కంపెనీలు అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఐటీ కంపెనీలే కాకుండా అకౌంటింగ్ సంస్థలు కూడా ఈ వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు.

అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తీసుకురావడానికి, తక్కువ వేతనాలతో స్థానిక ఉద్యోగులను తొలగించడానికి మధ్య చాలా వ్యత్యాసముందని వ్యాన్స్ స్పష్టం చేశారు. "సంవత్సరానికి 60,000 డాలర్లు సంపాదించే అమెరికన్ అకౌంటెంట్‌ను తొలగించి, ఆయన స్థానంలో 45,000 డాలర్ల జీతానికి...