భారతదేశం, మార్చి 24 -- అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణుల కలల వీసా 'హెచ్-1బీ' (H-1B) రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఈసారి అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల ముగిసిన రిజిస్ట్రేషన్లలో దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 30 నుంచి 50 శాతం వరకు దరఖాస్తులు తగ్గాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, పెరిగిన ఖర్చులే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రధానాంశాలు ఇవే:

సాధారణంగా పెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలు బల్క్ (Bulk) దరఖాస్తులు చేసేవి. కొత్త రూల్స్ వల్ల ఇప్పుడు ఆ కంపెనీలకు షాక్ తగిలింది. అయితే, ఈ మార్పులు కొందరికి వరంగా మారనున్నాయని వీసానోషన్ లా గ్రూప్ మేనేజింగ్ అటార్నీ శిల్పా మాలిక్ విశ్లేషించారు.

"పెద్ద ...