భారతదేశం, అక్టోబర్ 19 -- వాషింగ్టన్: అమెరికాలో స్థానిక ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకొస్తున్న వరుస ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు భారత ఐటీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అత్యధిక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణుల కోసం ఉద్దేశించిన హెచ్-1బీ వీసా వ్యవస్థలో రుసుములు పెంచడం, ఎంపిక ప్రక్రియను కఠినతరం చేయడంతో భారత దిగ్గజ కంపెనీలు తమ నియామకాల వ్యూహాన్ని మార్చుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 2027 హెచ్-1బీ లాటరీ నమోదుల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థల దరఖాస్తుల సంఖ్య దారుణంగా క్షీణించిందని కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) నివేదిక వెల్లడించింది.

అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవలు (యూఎస్ సీఐఎస్) సాంకేతిక విభాగం వెల్లడించిన డేటా ప్రకారం.. ప్రముఖ అవుట్‌సోర్సింగ్ కంపెనీ కాగ్నిజెంట్ గత ఏడాదితో పో...