భారతదేశం, డిసెంబర్ 22 -- అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బి (H-1B) వీసాల విషయంలో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఇప్పుడు అక్కడి విద్యావ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని పాఠశాలలు తీవ్రమైన ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. విదేశీ ఉపాధ్యాయులను నియమించుకోవడానికి అయ్యే ఖర్చును భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద ఎత్తున న్యాయపోరాటానికి దారితీసింది.

కొత్త నిబంధనల ప్రకారం, విదేశీ నిపుణులను నియమించుకునే సంస్థలు సాధారణ అప్లికేషన్ ఫీజులతో పాటు అదనంగా $100,000 (సుమారు రూ. 84 లక్షలు) స్పాన్సర్‌షిప్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా $9,500 నుంచి $18,800 మధ్య ఉండే ఈ ఖర్చు, ఒక్కసారిగా లక్ష డాలర్లకు చేరడంతో పాఠశాలలు బేలెత్తిపోతున్నాయి. కాలిఫోర్నియాలో గణితం, సైన్స్ వంటి కీలక సబ్జెక్ట...