భారతదేశం, మార్చి 19 -- ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ (HDFC)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ బ్యాంక్ చైర్మన్ అతనూ చక్రవర్తి తన పదవికి తక్షణమే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మార్చి 17న పంపిన రాజీనామా లేఖను బోర్డు ఆమోదించింది. అయితే, ఆయన రాజీనామాకు దారితీసిన కారణాలు ఇప్పుడు దేశీయ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా కార్పొరేట్ దిగ్గజాలు వ్యక్తిగత కారణాలంటూ పదవుల నుంచి తప్పుకుంటారు. కానీ, అతనూ చక్రవర్తి మాత్రం బ్యాంకులోని పద్ధతులపైనే నేరుగా విమర్శలు గుప్పించారు. "గడిచిన రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పరిణామాలు, పనితీరు నా వ్యక్తిగత విలువలకు, నైతికతకు ఏమాత్రం సరిపోలడం లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆయన తన రాజీనామా లేఖలో కుండబద్ధలు కొట్టారు. తన విలువలకు విరుద్ధంగా పని చేయడం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.