భారతదేశం, ఆగస్టు 29 -- అమెరికాలో స్థిరపడిన విదేశీ ఐటీ ఉద్యోగులకు, ప్రాథమికంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది నిపుణులకు అమెరికా ప్రభుత్వం నుంచి మరో చేదు వార్త అందుతోంది. కంపెనీలు లేఆఫ్ ప్రకటించినప్పుడు లేదా ఏదైనా కారణంతో ఉద్యోగం కోల్పోయినప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పూర్తిగా రద్దు చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్​ఎస్) ప్రతిపాదన సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు వైట్‌హౌస్‌కు చెందిన కీలక 'ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్' (ఓఐఆర్​ఏ) తాజాగా ఆమోద ముద్ర వేసింది.

2017లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం హెచ్-1బీ వీసాపై ఉన్న ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతే, అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ మరో ...