భారతదేశం, సెప్టెంబర్ 10 -- దేశీయ ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజం హీరో మోటార్స్ లిమిటెడ్ తమ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ప్రక్రియను వేగవంతం చేసింది. షేరు ప్రాథమిక ధరను (ప్రైస్ బ్యాండ్) రూ.79 నుంచి రూ.84గా నిర్ణయిస్తూ సంస్థ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఈ షేర్ల సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ సెప్టెంబర్ 16న (బుధవారం) ప్రారంభమై సెప్టెంబర్ 18న (శుక్రవారం) ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కేటాయింపులు సెప్టెంబర్ 15న జరగనున్నాయి.

ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 178 షేర్లు (ఒక లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే నిష్పత్తిలో (178 మల్టిపుల్స్) బిడ్లు దాఖలు చేయవచ్చు. మొత్తం ఇష్యూలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయర్లకు (క్యూఐబీ) గరిష్టంగా 50 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ఐఐ) కనీసం...