భారతదేశం, ఫిబ్రవరి 7 -- కోలీవుడ్ హీరోగా అర్జున్ సర్జా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయనకు తెలుగులో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా ఒకే ఒక్కడు, హనుమాన్ జంక్షన్, లై తదితర సినిమాలతో ఆకట్టుకున్నారు. అలాంటి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్టర్‌గా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే.

అలా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కానుంది.

సొంత కూతురుని హీరోయిన్‌గా అర్జున్ సర్జా పరిచయం చేయడం విశేషంగా మారింది. ఐశ్వర్య అర్జున్ డెబ్యూట్ మూవీ సీతా పయనంలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి నటీనటులు ఇతర ముఖ్య పా...