భారతదేశం, ఆగస్టు 7 -- హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న పారిశ్రామిక భూముల వినియోగ మార్పిడికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ(HILTP) కింద దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌ను తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 1 నుండి అక్టోబర్ 31 వరకు మూడు నెలల పాటు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో జూన్ 1 నుంచి జూన్ 30 వరకు కేవలం ఒక నెల మాత్రమే ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచారు. గడువు తక్కువగా ఉండటంతో పరిశ్రమల యజమానులు, పలు అసోసియేషన్ల ప్రతినిధులు గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వాలని, అలాగే జూన్ 5, 2026 కంటే ముందు అమలులో ఉన్న...