భారతదేశం, డిసెంబర్ 25 -- థాయిలాండ్, కాంబోడియా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఆధ్యాత్మిక రంగు పులుముకున్నాయి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో ఒక హిందూ దేవతా విగ్రహాన్ని థాయిలాండ్ సైన్యం కూల్చివేసిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, ఇది అత్యంత అగౌరవమైన చర్య అని, ఇలాంటివి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని పేర్కొంది.

కాంబోడియాలోని 'ప్రీ విహార్' ప్రావిన్స్ అధికారుల కథనం ప్రకారం.. గత సోమవారం థాయిలాండ్ సైన్యం ఒక హిందూ విగ్రహాన్ని ధ్వంసం చేసింది. ఈ విగ్రహాన్ని 2014లో 'అన్ సెస్' (An Ses) అనే ప్రాంతంలో నిర్మించారు. "ఈ విగ్రహం మా భూభాగంలో, సరిహద్దుకు దాదాపు 100 మీటర్ల లోపలే ఉంది" అని కాంబోడియా ప్రభుత్వ ప్రతినిధి కిమ్ చన్పన్హా వెల్లడించారు. అయితే, గూగుల్ మ్యాప్స్ డేటా ప్రకారం ఈ విగ్రహం సరిహద్దు రేఖకు ...