భారతదేశం, నవంబర్ 16 -- హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరగటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.

హిందూపురంలో వైసీపీ ఆఫీసు మీద జరిగిన దాడిని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు దాడి చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. ఆఫీసులపై దాడులు చేయటం, ఫర్నీచర్ ధ్వంసం చేయడం, అద్దాలు పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులను రాజకీయ పార్టీలు మొదలుపెడితే అది ప్రజాస్వామ్య పతనానికి నిదర్శనమన్నారు.

పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకుండా పూ...