హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు
భారతదేశం, జూలై 8 -- విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న డైట్ ఛార్జీల్లో 10 శాతం పెంచాలని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా... ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని సీఎం స్పష్టం చేశారు. బలహీనవర్గాల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..'బీసీ, ఎస్సీ,...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.