భారతదేశం, నవంబర్ 20 -- బంగారం అంటే భారతీయ కుటుంబాలకు కేవలం ఆభరణం మాత్రమే కాదు.. కష్టకాలంలో ఆదుకునే ఆపద్బాంధవుడు. అందుకే స్వచ్ఛతకు భరోసాగా భావించే బీఐఎస్ (BIS) హాల్‌మార్క్ చూసి కళ్లు మూసుకుని కొనుగోలు చేస్తుంటాం. అయితే ఈరోజు మీరు 22 క్యారెట్ల బంగారం అని కొనుగోలు చేసిన ఆభరణం, ఏడాది తర్వాత మార్పిడి చేసేటప్పుడో లేదా విక్రయించేటప్పుడో 20 క్యారెట్లే అని తేలితే ఎలా ఉంటుంది? అన్ని రకాల బీఐఎస్ హాల్‌మార్క్ ముద్రలు ఉన్నప్పటికీ, అసలు బంగారం కంటే ఎక్కువ ధర చెల్లించి మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన 'రీనియం పౌడర్' కల్తీ దందా ఆభరణాల స్వచ్ఛత పరీక్షల సామర్థ్యంపైనే తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

రీనియం అనేది అరుదైన, వెండి-తెలుపు రంగులో ఉండే అత్యధిక సాంద్రత (హై-డెన్సిటీ) కలిగిన లోహం. దీనిని జెట్ ఇంజిన్ల తయారీ వంటి పారిశ్రామిక అవసరాలకు విన...