భారతదేశం, జనవరి 20 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు సిట్ విచారణపై తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీశ్ రావు హాజరయ్యారన్నారు. రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉందని, అదే విధంగా అందరికీ అది అంటించాలని చూస్తున్నాడన్నారు.

అడ్డగోలు సిట్ విచారణల పేరుతోనే ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం అందలం ఎక్కిచ్చిన బుద్ధి మాత్రం బురదలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.

'ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక సమాచారం లేకుండా ఎన్ని రోజులు ఈ తమా...