భారతదేశం, ఆగస్టు 26 -- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా తీర సమీపంలో వీరంతా క్షేమంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు (AD) రమణారావు అధికారికంగా స్పష్టం చేశారు. దీంతో గడిచిన 20 రోజులుగా రోదనలతో నిండిన ఆ మత్స్యకార కుటుంబాల్లో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి.

ఈనెల 3వ తేదీన అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. సాధారణంగా కొన్ని రోజుల్లో తిరిగిరావాల్సిన వారు.. రోజులు గడుస్తున్నా ఇంటికి చేరుకోకపోవడంతో పాటు, వారితో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా తెగిపోయింది. సముద్రంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం, ఇంజిన్ వైఫల్యం లేదా బలమైన ఈదురుగాలుల వల్ల బోటు కొట్టుకుపోయి ఉంటుందని తీవ్ర ఆంద...