భారతదేశం, అక్టోబర్ 5 -- హన్మకొండలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారాన్ని డీఆర్ఐ అధికారులు గుట్టురట్టు చేశారు. ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ జోన్ అధికారులు నిఘా పెట్టారు. అక్టోబర్ 4వ తేదీన ఆపరేషన్ చేపట్టగా. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వీరి వద్ద నుంచి మొత్తం 6.53 కిలోల భారతీయ పాంగోలిన్ పొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సుమారు ఐదు పాంగోలిన్ల నుంచి పొందినట్లు అంచనా వేశారు. నిందితులను తదుపరి దర్యాప్తు కోసం హన్మకొండలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు అప్పగించారు.

పాంగోలిన్‌లను ప్రధానంగా చైనా, ఆగ్నేయాసియాలో వేటాడుతుంటారు. వాటి విలువైన పొలుసుల కోసమే ఈ వేట సాగుతుంది. వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 షెడ్యూల్-Iలో జాబితాలో ఇండియన్ పాంగోలిన్ ఉండటంతో పాటు ఇటువంటి జంతువుల వేటపై నిషేధ...