భారతదేశం, మే 11 -- హనుమాన్ జయంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది భక్తి, శక్తి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. హనుమాన్ జయంతి నాడు భక్తులు చేసే చిన్న ప్రయత్నం కూడా వారి జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఈ పవిత్ర దినాన మీ కోరికలు నెరవేరి, ఆయురారోగ్యాలు సిద్ధించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మే 12వ తేదీన ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది.

శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడు వాయుదేవుని అంశతో పుట్టిన వాయుపుత్రుడు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడిని పూజించడం వల్ల భయం తొలగిపోయి, మానసిక ధైర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం.

హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. సింధూరం రంగు వస్త్రాలు ధరించడం ఆంజనేయుడికి అత్యంత ప్రీతికరం. పూజా గదిలో హనుమంతుడి విగ్రహం లేదా పటం ముందు దీపారాధన చేసి...