భారతదేశం, సెప్టెంబర్ 20 -- కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ హనుమంత వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందా... గోవిందా... అంటూ స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు శ్రీరామావతారంలో తన పరమభక్తుడైన హనుమంతునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు భగవంతునిపై అచంచలమైన భక్తి, సేవాభావం, శరణాగతికి ప్రతిరూపంగా నిలుస్తాడు.

గురుశిష...