భారతదేశం, మార్చి 9 -- తిరుపతి శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం నోటిఫికేషన్ వెలువడింది. వెంటనే అప్లై చేసుకోవాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 20వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి.

మెుత్తం మూడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటి. సెక్యూరిటీ ఆఫీసర్ రెండు.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ కలిగి ఉండాలి. మెరిటోరియస్ ఎక్స్-ఆర్మీ సిబ్బంది అయి ఉండాలి. A.P పోలీస్ డిపార్ట్‌మెంట్ సీఐ కేడర్‌కు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ అర్హత కావాలి. ఎత్తు - 170 సెం.మీ., ఛాతీ - 81 సెం.మీ. (గాలీ పీల్చినప్పుడు 85 సెం.మీ.). ఆరోగ్యకరంగా ఉండాలి. దృష్టి...